![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -451 లో......దీప, కార్తీక్ ఇద్దరు సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు. ఒక సుమిత్ర తప్ప అందరు పూజకి వస్తారు. పారిజాతం అందిరితో తను మారిపోయినట్లు మాట్లాడుతుంది. అది చూసి దాస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ మారిపోయింది. నువ్వు ఎప్పుడు మారుతావోనని జ్యోత్స్నతో అంటాడు దాస్. అయిన నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అని దాస్ తో అంటుంది జ్యోత్స్న.
నువ్వు పెళ్లికి రావద్దన్నావ్ పూజకి కాదు.. నన్ను కార్తీక్ పిలిచాడని దాస్ అంటాడు. నువ్వు నిజం తెలియనంత వరకే ఇవన్నీ అనుభవిస్తుంటావ్.. ఎప్పుడు నిజం తెలుస్తుందో తెలియదు.. ఆ లోపు సంతోషంగా ఉండు అని జ్యోత్స్నకి దాస్ వార్నింగ్ ఇస్తాడు. ఒకసారి నిజం తెలిసిందంటే నన్ను మీరు తట్టుకోలేరని జ్యోత్స్న అనుకుంటుంది. పూజ జరుగుతుంది.. అమ్మాయి తల్లిదండ్రులు బట్టలు పెట్టాలని పూజరి అంటాడు. నా భార్య రాలేదు నేను పెడతానని దశరథ్ పెడుతుంటే సుమిత్ర వచ్చి తన చెయ్ కూడా పెడుతుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.ఆ తర్వాత పూజ పూర్తవుతుంది. అందరికి వాయినం ఇచ్చి దీప పంపిస్తుంది.
తాతయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కార్తీక్, దీపలతో కాంచన అనగానే.. స్వప్న అక్షింతలు తీసుకోవడానికి పారిజాతం గారు జరగండి అని అంటుంది. ఏంటే నువ్వు ఏంటే నీ స్థాయి ఏంటి నన్ను పక్కకి జరగమంటున్నావని పారిజాతం గొడవ మొదలుపెడుతుంది. స్థాయి గురించి మాట్లాడుతున్నావ్.. ఎవరి స్థాయి ఏంటో తెలుసు.. పెళ్లిలో తాళి తీసావని స్వప్న అంటుంది. నేను తియ్యడం ఏంటని పారిజాతం అంటుంది. ఆ తాళి ఎవరు తీసారో నాకు తెలుసని పారిజాతం అంటుంది. దాంతో సుమిత్ర టెన్షన్ పడుతుంది. ఇప్పుడు పారు అత్తయ్య పేరు చెప్తుందా అని కార్తీక్ టెన్షన్ పడతాడు. శివన్నారాయణ దశరథ్ అందరు పారిజాతాన్ని ఎవరు తాళి తీశారని అడుగుతారు. ఎవరు తాళి తీశారు చెప్పండి అని పారిజాతాన్ని దీప అడుగుతుంది. నన్ను అడుగుతావేంటి మీ అయన కార్తీక్ ని అడుగమని పారిజాతం అనగానే ఆయనకు తెలుసా అని దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |